Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిజాంపేట
మండల పరిధిలోని రాంపూర్, నస్కల్, నందగోకుల్, నగరం, చల్మెడ గ్రామాల్లో ఎంపీపీ దేశెట్టి సిద్ధ రాములు, రామాయంపేట పీఏసీఎస్ చైర్మన్ బాదే చంద్రం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. వడ్లు ఏ రకం రూ.2,060, బీ రకం రూ.2,040 మద్దతు ధర ప్రకటించిందన్నారు. బస్తా 41 కిలో వరకే తూకం చేయాలన్నారు. కార్యక్రమంలో నస్కల్ పీఏసీఎస్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, సీఈవో పుట్టి నరసింహులు, కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ గౌస్, వైస్ చైర్మన్ వెంకటస్వామి, నస్కల్ సర్పంచ్ కవిత రాజ్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ దేశెట్టి లింగం, రైతులు తదితరులు పాల్గొన్నారు.