Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి బసవరాజ్
నవతెలంగాణ-రేగోడు
గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బసవరాజు అన్నారు. గురువారం రేగోడుకు వచ్చిన ఆయన గ్రామపంచాయతీ కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు సబ్బులు, సర్ఫ్, వంట నూనెలు ఇవ్వాలని కోరారు. ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రతతో పాటు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబానికి రూ.పది లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.