Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
- అదనపు కలెక్టర్ రమేష్
నవతెలంగాణ-మెదక్ రూరల్
వానాకాలంలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయుటకు జిల్లాలో 154 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 712 మంది రైతుల నుంచి 3,468 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని అదనపు కలెక్టర్ రమేష్ తెలిపారు. జిల్లాలో ఈ వానాకాలం 2022-23 విపణిలోకి 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసి అందుకనుగుణంగా ఐ.కె.పి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు డీసీఎంఎస్ రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా జిల్లాలో 410 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకొని నేటి వరకు 154 కేంద్రాల ద్వారా 7 కోట్ల 14 లక్షల విలువ గల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఎప్పటికప్పుడు అధికారులకు కేంద్రం నిర్వహకులకు తగు ఆదేశాలిస్తూ ధాన్యం కోనుగోళ్లు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తాళ్లు ఎఫ్ఎక్యూ ప్రమాణాలకనుగుణంగా పరిశీలించిన తరువాతే ధాన్యం రైస్ మిల్లులకు పంపించడం జరుగుతుందన్నారు. కాబట్టి అన్లోడ్ చేసుకోవడంలో మిల్లర్లు ఇబ్బందులు కలుగ చేయరాదని సూచించారు. ధాన్యం తరలిం చేందుకు వినియోగించే వాహనాలు రోడ్లపై వేచి ఉండకుండా కొనుగోలు కేంద్రాలలో మిల్లుల్లో అవసరం మేర కూలీలను ఏర్పాటు చేసుకొని లోడింగ్, అన్ లోడింగ్ వెంటనే జరిగేలా చూడాలన్నారు. ట్యాబ్ ఎంట్రి కూడా వేగవంతంగా జరగాలని అదనపు కలెక్టర్ రమేష్ సూచించారు.