Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేగుంట
మెదక్ జిల్లాకు 50 పడకల ఆసుపత్రి కోసం క్రిటికల్ కేర్ కింద రూ.24 కోట్లను నరేంద్ర మోడీ ప్రభుత్వం మంజూరు చేసిందని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు పేర్కొన్నారు. చేగుంట మండలం గొల్లపల్లి, రెడ్డిపల్లి, గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలకు గురువారం ఎమ్మెల్యే రఘునందన్‌రావు భూమి పూజ, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పల్లె దావఖానాల వల్ల ప్రజలకు వైద్యం మరింత చేరువవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రైమరీ హెల్త్ సెంటర్లు వెల్నెస్ సెంటర్ల పేర్ల 2600 సబ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారన్నారు. అలాగే చేగుంట మండలానికి నేషనల్ హెల్త్ మిషన్ కింద 7 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు మంజూరయ్యాయన్నారు. అందులో రెండు సెంటర్లకు శంకు స్థాపనలు చేశామన్నారు. త్వరలోనే ఐదు సెంటర్లు పూర్తి చేస్తామన్నారు. ఒక్క ఉప ఆరోగ్య కేంద్రానికి రూ.20 లక్షలు మంజూరు చేసిందన్నారు. కాంట్రాక్టర్లు 6 నెలల లోపల పనులు పూర్తి చేయాలన్నారు. అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. గొల్లపల్లి పాఠశాల విద్యార్థులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరగా బస్సు సౌకర్యం కోసం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య హెల్త్ సెంటర్లు ఉగాది లోపల పూర్తి చేసి గ్రామీణ పేద ప్రజలకు పూర్తి వైద్యం అందించేలా కృషి చేస్తామ న్నారు. పెద్ద శివనూర్ గ్రామంలో అతిసార వ్యాధితో మృతి చెందిన బాధిత కుటుం బాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఈ రవీందర్ రెడ్డి, వైసీపీ రామ చంద్రం, గొల్లపల్లి సర్పంచ్ ఎల్లారెడ్డి, రెడ్డిపల్లి సర్పంచ్ లక్ష్మి, మండల పార్టీ అధ్య క్షులు చిం తల భూపాల్, దుబ్బాక నియోజకవర్గం కో కన్వీనర్ గోవింద్ కృష్ణ, పట్ట ణ అధ్యక్షులు సాయి, మాజీ వైస్ ఎంపీపీ పాండు, నాయకులు ఉప్పు నరేందర్, కాంతారావు, హెల్త్ సిబ్బంది, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.