Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాహనదారులు ఆదమరిచారో అంతే
- చలికాలంలో పరిమితవేగం సురక్షితం
- వేగం కన్నా ప్రాణం ముఖ్యమని గుర్తించాలి
నవతెలంగాణ-మెదక్ రూరల్
ప్రతి ఒక్కరు వేగం కన్నా ప్రాణం ముఖ్యమని గుర్తించాలని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని వాహనదారులకు సూచించారు. మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ శీతాకాలంలో జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుతాయని, పొగమంచు దట్టంగా కమ్మేస్తుందని తెలిపారు ఉదయం 8 గంటలైనా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితులు ఏర్పడతాయన్నారు. ఈ సమయంలోనే ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నదన్నారు. వాహనాల నుంచి వెలుపడే పొగ కారణంగా మంచు మరింత దట్టంగా మారు తుందన్నారు. దాని వల్ల రహదారి ఐదారు మీటర్ల దూరం వరకు కనిపించని పరిస్థితి ఉంటుందన్నారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పొగమంచు అధికంగా ఉంటుందని ఈ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువన్నారు. అందుకే చలికాలంలో డ్రైవింగ్ చేసేప్పుడు వాహనాల హెడ్లైట్లు, ఇండికేటర్లు, బ్రేక్లైట్లు వేసుకోవాలన్నారు. వేగం కాదు ప్రాణాలే ముఖ్యమని ప్రతి వా హనదారుడు గుర్తించాలని ఎస్పీ సూచించారు.