Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొగాకు నియంత్రణ జిల్లా సూపర్ వైజర్ విష్ణువర్ధన్ రెడ్డి
నవతెలంగాణ-ఐడిఏ బొల్లారం
పొగాకుతో తయారైన వాటిని ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరమని పొగాకు నియంత్రణ విభాగం జిల్లా సూపర్ వైజర్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా గురువారం బొల్లారం పట్టణంలోని ఎక్స్ రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, మున్సిపల్ కార్యాలయం వద్ద మైకుతో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తులను వాడడం వల్ల మనిషి ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. ప్రతి ఒక్కరూ పొగాకు వల్ల జరిగే నష్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పొగాకు ఉత్పత్తులైన బీడీ, చుట్ట, సిగరెట్, జరదా, తంబాకు, పాన్ మసాలా లాంటివి ఉపయోగించరాదన్నారు. వీటి వాడకం వల్ల మనుషుల్లో హైపర్ టెన్షన్, నోటి క్యాన్సర్, శ్వాసకోస, గుండె సంబంధిత వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయడం సెక్షన్ 4 ప్రకారం నేరమని, రూ. 200ల జరిమానా కూడా విధించబడుతుందన్నారు. పొగాకు ఉత్పత్తుల ప్రచారం, పోస్టర్లను వేయడం సెక్షన్ 5 ప్రకారం నేరమని, రెండు సంవత్సరాలపాటు జైలుశిక్ష కూడా విధించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ధూమపానం చేస్తూ ద్విచక్ర వాహనం నడుపుతున్న కాజిపల్లి గ్రామానికి చెందిన సాయులుకు రూ,200లు జరిమానా విధించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు జిల్లాలో ఎప్పుడు రద్దీగా ఉండే ప్రదేశాలలో నిరంతరం అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. పొగాకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఏఎస్ఐ ధర్మలు పాల్గొన్నారు.