Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 44 వేల చెట్ల బిల్లులు కాజేశారు
- సర్పంచ్, ఉప సర్పంచ్, ఫీల్డ్ అసిస్టెంట్,
- టెక్నికల్ అసిస్టెంట్లకు ముడుపులు
- కొట్టాల గ్రామపంచాయతీలో అవినీతి బాగోతం
నవతెలంగాణ-కౌడిపల్లి
తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితవనంలో రూ.16 లక్షల గోల్మాల్ అయినట్లు గ్రామస్తులు ఆరోపించారు. గురువారం మండలంలోని కొట్టాల పంచాయతీలో గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం... 2019లో లింగంపల్లి అడవి ప్రాంతంలో హరితవనం పేరిట 44,80 మొక్కలు నాటారు. వీటికి లింగంపల్లి గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల కొమురయ్య ట్యాంకర్ ద్వారా నీరు పోస్తూ మొక్కలను పెంచారు. 2020లో ఫీల్డ్ అసిస్టెంట్ అర్జున్ యాదవ్, టెక్నికల్ అసిస్టెంట్ స్వాతి బిల్లులు ఎక్కువగా చేయడంతో రూ.16.63 లక్షలను విడతలవారీగా గ్రామపంచాయతీ ఖాతాలో జమైంది. ఈ మొత్తం డబ్బును సర్పంచ్ నరహరి చెక్కుల రూపంలో ఉపసర్పంచ్ మాధవరెడ్డి, కొమురయ్యలకు అందజేశారు.
మాకు కూడా డబ్బులు ఇవ్వాలంటూ టెక్నికల్ అసిస్టెంట్ స్వాతి భర్త వెల్మకన్నె ఫీల్డ్ అసిస్టెంట్ ముత్యాలు, కొట్టాల ఫీల్డ్ అసిస్టెంట్ అర్జున్, సర్పంచ్ నరహరి, ఉపసర్పంచ్ మాధవరెడ్డిలు కొమురయ్యపై ఒత్తిడి చేశారు. దీంతో సర్పంచ్ నరహరికి రూ.2 లక్షలు, ఉప సర్పంచ్ మాధవరెడ్డికి రూ.90 వేలు, ఫిల్డ్ అసిస్టెంట్ అర్జున్‌కు రూ.1.70 లక్షలు, టెక్నికల్ అసిస్టెంట్ స్వాతి భర్త ముత్యాలకు రూ.1.60 లక్షలు ఇచ్చినట్టు కొమురయ్య తెలిపారు. ఈ విషయమై సర్పంచ్ నరహరిని వివరణ కోరగా తనకు ఎలాంటి డబ్బులు లంచంగా ఇవ్వలేదని, అప్పుగా తీసుకున్న డబ్బులను వారికి తిరిగి చెల్లించానని తెలిపారు.