Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్దూరు
డిసెంబర్ 21 నుంచి 23 వరకు సిద్దిపేటలో జరిగే సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు దాసరి కళావతి, జిల్లా కార్యదర్శి చొప్పరి రవికుమార్ పిలుపునిచ్చారు. దూల్మిట్ట మండల కేంద్రంలో సీఐటీయూ మండల కమిటీ సమావేశం సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు దాసరి కళావతి, జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు, మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా నిరంతరం కార్మికులను, ప్రజలను చైతన్య పరుస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలంటూ, కార్మిక హక్కులను రక్షించాలని కోరుతూ, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కార్మిక వ్యతిరేకంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్ లను రద్దు పరచాలని, దేశవ్యాప్తంగా అనేక సమస్యలు తీసుకొని కార్మిక వర్గ పక్షాన పోరాటాలు నిర్వహించి, అనేక సమ్మెలు నిర్వహించి ఫలితాలు సాధించి వాటి ఫలాలను కార్మిక వర్గానికి అందించిన కార్మిక వర్గ వేగుచుక్క సిఐటియు అని వారు అన్నారు సిఐటియు తెలంగాణ రాష్ట్ర మహాసభలు సిద్దిపేట జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నామని జయప్రదానికి అన్ని యూనియన్ల, సంఘాల కార్మిక ప్రతినిధులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు జిల్లాలోని వివిధ వర్గాల ప్రజలు మేధావులు సామాజికవేత్తలు వ్యాపార వర్గాలు ఉద్యో ఉద్యోగస్తులు మధ్య తరగతి ప్రజలు పెద్ద ఎత్తున తమ యొక్క సహాయ సహకారాలు అందించి మహాసభల విజయవంతానికి కషి చేయాలని వారు కోరారు సిఐటియు నాయకులు పోతురాజు వీరయ్య, జాగిరి సత్యనారాయణ, చొప్పరి కనకయ్య, ఎర్ర రవి, మల్లం భాస్కర్, రాజన్న, ప్రభాకర్, యాదగిరి, రేణుక, యాదయ్య, మల్లేశం, రుద్రబోయిన శ్రీనివాస్, స్వర్గం సాంబయ్య సభ్యులు నరసింహులు, రాయ నర్సు, సత్యం యాదగిరి, వెంకటయ్య, రాజు, కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.