Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్దూరు
ధూల్మిట్ట మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో మద్దూరు మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఓర్వడం లేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ మలిపెద్ది సుమ మల్లేశం, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మేక సంతోష్ కుమార్, రేబర్తి పీఏసీఎస్ చైర్మన్ నాగిళ్ల తిరుపతిరెడ్డి, రేబర్తి పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఇర్రి రాజిరెడ్డి, మద్దూరు దూల్మిట్ట సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు వంగ భాస్కర్ రెడ్డి, చొప్పరి వరలక్ష్మి సాగర్, సర్పంచులు దొబ్బుడు దీపిక వేణుగోపాల్ రెడ్డి, కంట రెడ్డి జనార్దన్ రెడ్డి, చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశం, కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్లు కాసర్ల కనకరాజు, చెట్కూరి తిరుపతి, మాజీ జెడ్పీటీసీ నాచగోని పద్మ వెంకట్ గౌడ్, టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు బడుగు సాయిలు, గూడ రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు పోతుగంటి రవీందర్, సోషల్ మీడియా ఇన్చార్జి పాకాల కిరణ్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.