Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు రెడ్డమైన అరవింద్
నవతెలంగాణ-జగదేవపూర్
ఎస్ఎఫ్ఐ 17 వ జాతీయ మహాసభల సందర్భంగా శుక్రవారం జగదేపూర్ మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన విద్యా విధానంపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్కు ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రెడ్డమైన అరవింద్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నూతన విద్యా విధానం వల్ల అనేకమంది విద్యార్థులు విద్యకు దూరమవుతారని, ఈ నూతన విద్యా విధానం అశాస్త్రీయంగా జ్యోతిష్యం బాబాల జీవిత చరిత్రలను పాఠ్య పుస్తకాలలో చేర్పించి విద్యార్థుల మెదడు శాస్త్రీయంగా ఆలోచించకుండా మూఢనమ్మకాలు జ్యోతిష్యాలు నమ్మేవిధంగా విధంగా ప్రభావితం చేస్తుం దన్నారు. నూతన విద్యా విధానం వల్ల ప్రాథమిక పాఠశాలు నాశనమవుతాయన్నారు. నుతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వెల్ డివి జన్ అధ్యక్షుడు నాచారం శేఖర్, మండల కార్యదర్శి పులి శివ కుమార్, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.