Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా సైన్స్ అధికారి కల్లేపల్లి శ్రీనివాస్
నవతెలంగాణ-సిద్దిపేట
నవంబర్ మూడవ వారంలో జరిగే సైన్స్ కార్యక్రమాలకు 30వ బాలల సైన్స్ కాంగ్రెస్, స్కూల్ ఇన్నోవేషన్-2022 , సైన్స్ ఫెయిర్ వంటి కార్యక్రమాలకు విద్యార్థులను సంసిద్ధు లు చేయాలని జిల్లా సైన్స్ అధికారి కల్లేపల్లి శ్రీనివాస్ సూచిం చారు. సిద్దిపేటలోని న్యూ హైస్కూల్లో సైన్సు ఉపాధ్యాయు లకు జరిగిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులలో విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించి, వారిలోని సృజనాత్మకతను వెలికి తీసి, సమాజానికి ప్రయోజనం చేకూర్చేందుకు ఈ సైన్సు కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రధానంగా ఈ నెల 19న జిల్లాస్థాయిలో బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు నుంచి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టును రూపొందిం చాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ వ్యవస్థ గురించి తెలుసుకోవడం, ఆరోగ్యం పోషణ సంక్షేమం పెంపొందిం చడం, పర్యావరణ వ్యవస్థ, ఆరోగ్యం కోసం సామాజిక సాంస్కృతిక పద్ధతులు, స్వీయ విశ్వాసం కోసం పర్యావరణ వ్యవస్థ ఆధారిత విధానం, పర్యావరణ వ్యవస్థ, ఆరోగ్యం కోసం సాంకేతికత ఆవిష్కరణలు అనే అంశాలపై ప్రాజెక్టులు తయారు చేయాల్సి ఉంటుందన్నారు. ఏదైనా ఒక అంశానికి సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టు తయారుచేసి ప్రదర్శిం చాల న్నారు. ఈ ప్రాజెక్టు రిపోర్టు తయారీలో 6 నుంచి 10 తరగతి విద్యార్థుల్లో ఇద్దరినీ జట్టుగా చేసి ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయడంలో సైన్స్ ఉపాధ్యాయులు సహకరించాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ కోఆర్డి నేటర్ సా దత్ అలీ, రిసోర్స్ పర్సన్స్ నాగరాజు, గ్యారా ప్రవీణ్ కుమార్, రాజమౌళి, జిల్లాలోని సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.