Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి
నవతెలంగాణ-సిద్దిపేట
రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తే, మంత్రి హరీశ్ రావు కషితో మార్కెట్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో 27 గోదాంలే ఉంటే, నేడు 63 గోదాంలు 1.51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంకు సరిపడా గోదాంలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. రైతు పండించిన ప్రతి గింజను కొనడమే ప్రభుత్వ లక్ష్యమని, మొన్నటి పంట సమయంలో కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయక పోయినా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మంత్రి హరీశ్‌రావు కృషి చేస్తున్నారన్నారన్నారు. కేసీఆర్, హరీశ్‌రావుల కృషి వ్యవసాయ రంగంలో అధ్బుతమైన ప్రగతి పథంలో నడుస్తున్నదన్నారు. నాణ్యమైన ఉచిత విద్యుత్తును వ్యవసాయ రంగానికి అందిస్తూ, పెట్టుబడి సాయం కూడా అందిస్తున్నారన్నారు. నూతన వ్యవసాయ పద్ధతులు, విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి వ్యవసాయంలో అధిక దిగుబడికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీటితో రాష్ట్రంలోనే అత్యధిక పంటను జిల్లాలో దిగుబడి చేశామన్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో రైతు ప్రభుత్వమని నిరూపించుకుందన్నారు. జిల్లాలో పండిన ప్రతిగింజను ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని, రైతులు దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గంప రామచంద్రం, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దరిపల్లి శ్రీను, మోఇజ్, మార్కెట్ కమిటీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.