Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
- ఎంపిపి లకావత్ మానససుభాష్
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
గ్రామాలలో రైతులు వరి ధాన్యం దళారులకు అమ్మి మోసపోవద్దని హుస్నాబాద్ ఎంపీపీ లకవత్ మానస సుభాష్ అన్నారు. శుక్రవారం మండలంలోని మీర్జాపూర్, జిల్లెల్లగడ్డ, బల్లునాయక్ తండా, వంగ రామయ్యపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర రూ.2060 పొందాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో అక్కన్నపేట జెడ్పీటీసీ భుక్యా మంగ, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొండల్ రెడ్డి, సర్పంచ్లు తరాల లత మహేందర్, లావుడ్యా స్వరూప, ఇస్లావత్ రజిత, మాజీ ఏఎంసి చైర్మన్ ఎడబోయిన తిరుపతి రెడ్డి, గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బండి రమణారెడ్డి, పోన్న బోయిన శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు శారద, జ్యోతి, రాకేస్, నాజియా హీనా రైతులు తదితరులు పాల్గొన్నారు.
పందిల్లలో కొనుగోలు కేంద్రం ప్రారంభం
పందిళ్ళ గ్రామంలో సర్పంచ్ తోడేటి రమేష్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సుష్మ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు రైతులు పాల్గొన్నారు.