Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిధులున్నా సాగని రాజిరెడ్డిపల్లి చెరువు సుందరీకరణ పనులు
నవతెలంగాణ -గజ్వేల్
గజ్వేల్ పట్టణంలోని రాజిరెడ్డిపల్లి సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చాలని 8 సంవత్సరాలుగా అధికారుల దృష్టికి తీసుకుపోతున్నా ఫలితంలేకుండా పోతోందని స్థానికులు వాపోతున్నారు. మాంకాలమ్మ టెంపుల్ నుంచి రాజిరెడ్డిపల్లి గ్రామం వరకు ఒక కిలోమీటర్ రోడ్డు చేయమంటే అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన పాలకులు చేతులు దులిపేసుకుంటున్నారు. కొన్ని నిధులు మంజూరు కావడంతో టెండర్ పెట్టినప్పటికీ పనులు చేయలేకపోతున్నారనే విమర్శలున్నాయి. కేవలం కిలోమీటర్ రోడ్డు పనులు చేపట్టకపోవంలో ఆంతర్యమేమిటని స్థానికులు ప్రశ్ని స్తున్నారు. డబుల్ రోడ్డు చేయాలని అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. రోడ్డు సౌకర్యం కల్పిస్తే పిడిచేడు రోడ్డులో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని అంటున్నారు. కౌన్సిలర్ బాలమణి ఈ సమస్యను మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లడంతో పనులు చేపట్టాలని ఆదేశించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఈ విషయంలో జోక్యం చేసుకొని మాంకాలమ్మ టెంపుల్ నుంచి రాజిరెడ్డిపల్లి గ్రామం వరకు డబుల్ రోడ్డు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
చెరువు అదే దుస్థితి..
రాజురెడ్డిపల్లి చెరువు మరమ్మతులకు మిషన్ కాకతీయ కింద రూ.కోటి మంజూరు చేశారు. కొంతమేరకు పనులు చేసి వదిలేసారు. కొంత వరకు కట్ట వెడల్పు చేసినప్పటికీ రాకపోకలకు ఇబ్బంది మారిందని పేర్కొంటున్నారు. కట్టపై సుందరీకరణ పనులు, సీసీరోడ్డు వేయాలని అంటున్నారు. కౌన్సిలర్ బాలమణి దృష్టికి తీసుకుపోయినా పనులు కావడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ పాలకవర్గం స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేకుంటే గడ కార్యాలయం ముందు రస్తారోకో చేస్తామని హెచ్చరిస్తున్నారు.
పనులు వెంటనే ప్రారంభించాలి
రాజిరెడ్డిపల్లికి డబుల్ రోడ్డు వేయాలి. పనులు వెంటనే ప్రారంభించాలి. విలీనంతో నష్టం తప్ప లాభం లేదు. చెరువు పనులు కూడా వెంటనే ప్రారంభించాలి.
- నిత్య రాజు
అధికారులు పట్టించుకోవాలి
మున్సిపల్ పరిధిలోని రాజరెడ్డిపల్లి గ్రామాన్ని అధికారులు, మున్సిపల్ పాలకవర్గం పట్టిం చుకోవాలి. కిలోమీటర్ డబుల్ రోడ్డు చేయాలి. పనులు ప్రారంభించకపోతే ఆందోళన చేస్తాం.
- గుంటి కుమార్