Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొగుట
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతులు పండించిన దాన్యం అమ్ముకోవాలని సర్పంచ్ సిలివేరి జ్యోతి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని జప్తి లింగారెడ్డి పల్లి గ్రామంలో ఐకెపి ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలని సూచించారు. ప్రభుత్వం రైతుల మేలు కోరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బక్క కనకయ్య, ఉప సర్పంచ్ సురేష్ గౌడ్, ఐకేపీ సీసీి దాసు, వెలుగు సీిఏలు లక్ష్మి, రవి, గ్రామ వీవో లీడర్లు సింగాటం లచ్చవ్వ, బ్యాగరి రజిత, పంచాయతీ కార్యదర్శి వేలాద్రి, వార్డు సభ్యులు బిక్షపతి, పులిందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, యాదవ రెడ్డి, జగన్నాథరెడ్డి, నర్సింలు, మల్లయ్య, రాం రెడ్డి, నరసింహారెడ్డి, గ్రామ రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.