Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ చీప్ సైంటిస్ట్ శ్రీధర్
- అట్టహాసంగా ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు
నవతెలంగాణ-నర్సాపూర్
కెమికల్ ఇంజనీర్లకు దేశ విదేశాల్లో మంచి భవిష్యత్తు ఉందని హైదరాబాద్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ చీప్ సైంటిస్ట్ శ్రీధర్ అన్నారు. శుక్రవారం నర్సాపూర్ పట్టణ సమీపంలోని బివి రాజు ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ కెమికల్ బయో ఎన్విరాన్ మెంటల్ ఇంజనీరింగ్ సరస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వివిధ పరిశ్రమల విద్యాసంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సైంటిస్ట్ శ్రీధర్ మాట్లాడుతూ కెమికల్ ఇంజనీరింగ్ ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు పిల్లలకు అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు ఇటువంటి సదస్సులు నిర్వహించడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు. అనంతరం గౌరవ అతిథి కిరణ్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యాంశాలను ఇష్టంగా క్షుణ్ణంగా నేర్చుకోవాలని సూచించారు కోవిడ్ సమయంలో వ్యాక్సినేషన్ తయారు చేయడంలో కెమికల్ ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని గుర్తు చేశారు. అనంతరం విష్ణు విద్యా సంస్థల చైర్మన్ విష్ణు రాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ కళాశాలలో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా జాతీయ అంతర్జాతీయ సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు కంట దిండ రవిశంకర్ చౌదరి, బీవీఆర్ఐటీ ప్రిన్సిపాల్ లక్ష్మీ ప్రసాద్, కెమికల్ ఇంజనీరింగ్ హెచ్ఓడి డాక్టర్ రాధిక పాల్గొన్నారు.