Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేగుంట
దళారులను నమ్మి రైతన్నలు మోసపోవద్దని, పండించిన వరి ధాన్యాన్ని ఐకేపీ, పీఏసీఎస్ కొను గోలు కేంద్రాల వద్దనే రైతులు అమ్ముకోవాలని సర్పం చ్ కొఠారి అశోక్ పేర్కొన్నారు. చేగుంట మండలం చిన్నచిన్నూరు గ్రామం ఐకేపీ ఆధ్వర్యంలో శుక్రవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఐకేపీ సీసీ రామస్వామితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం తేమ మిషన్‌ను పరిశీలించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ రైతన్నలు ఆరుగాలం పండించిన వరి ధాన్యాన్ని దళారుల చేతిలో పెట్టి మోసపోవద్దన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యాన్ని అమ్ముకోవాలని, పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా తీసుకురావా లన్నారు. కొనుగోలు చేసిన వారం రోజుల్లో డబ్బులు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పాక స్వామి, ఐకేపీ గ్రూప్ సభ్యులు జ్యోతి, రేణుక, శ్వేత, ధనలక్ష్మి, మంజుల, రమేష్ గౌడ్, ఈశ్వర్ గౌడ్, గోలి సంతు, బందెల్లె, పాలకవర్గం పాల్గొన్నారు.
నవతెలంగాణ-పెద్ద శంకరంపేట్
రైతులు అరు కాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కోరారు. శుక్రవారం పెద్ద శంకరంపేట మండల పరిధిలోని బుజరాన్ పల్లి, జంబికుంట, రామోజీ పల్లి తదితర గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దళారుల నుంచి రైతులను ఆదుకోవడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, ప్రతి ఒక్కరూ వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ జంగం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, ఎంపీటీసీలు వీణ సుభాష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ వేణుగోపాల్ గౌడ్, నాయకులు, రాములు సాయిలు, మహిళా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-నిజాంపేట
మండల పరిధిలోని కల్వకుంట, రజాక్ పల్లి, బచ్చు రాజు పల్లి, నిజాంపేట గ్రామాల్లో ఎంపీపీ దేశెట్టి సిద్ధ రాములు ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. గతంలో ఎక్కడ చూసినా దళారి వ్యవస్థను ఉండేదని, దళారుల బారిన పడకుండా రైతులను కాపాడేందుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ఏ రకం వడ్లకు రూ.2060లు, బి రకం వడ్లకు రూ.2040 ధర ప్రకటించిందన్నారు. 41 కిలోల వరకే తూకం చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్ర మంలో వ్యవసాయ అధికారి సతీష్, పీఏసీఎస్ చైర్మన్ పప్పుల బాపురెడ్డి, సర్పంచ్ అనూష లక్ష్మీ నరసింహ, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, డైరెక్టర్లు ఎండి అబ్దుల్, బండారి ఎర్ర ఎల్లయ్య, పప్పుల కిష్టారెడ్డి, స్వామి గౌడ్, నాయిని లక్ష్మణ్, పంచాయతీ వార్డు మెంబర్ తిరుమల్ గౌడ్, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు
నవతెలంగాణ-టేక్మాల్
మండలంలోని అచ్చంపల్లి గ్రామంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సర్ఫ్), ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ చింతా స్వప్న రవి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు శ్వేత శేఖర్ రెడ్డి, సర్పంచ్ కవితలతో కలిసి ఎంపీపీ చింతా స్వప్న రవి ప్రారంభించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఏ గ్రేడ్ ధాన్యంకు రూ.2060లు, బి గ్రేడ్ ధాన్యంకు రూ.2040 ప్రభుత్వం చెల్లిస్తుందని వారు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్, అచ్చన్న పల్లి సర్పంచ్ కవిత, ఐకేపీ ఏపీఎం రామకృష్ణ, ఎంపీటీసీలు మోహన్, చింత రవి, అశోక్, ఐకేపీ సీసీలు దుర్గయ్య, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-రామాయంపేట
దళారులను నమ్మి మోసపోవద్దని, రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని విక్రయిం చాలని రామాయంపేట పీఏసీఎస్ చైర్మెన్ బాదె చంద్రం అన్నారు. శుక్రవారం మండల పరిదిలోని రాయిలాపూర్, శివాయిపల్లి, ఝాన్సిలింగాపూర్, పర్వతాపూర్, కాట్రియాల, లక్షా ్మపూర్, తొనిగండ్ల గ్రామాలలో ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు కేందాలను ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆయ న మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేందాలలో మద్దతు ధర ఏ గ్రేడ్, రూ.2060, బి గ్రేడ్ రూ.2040 లకు ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయన్నారు. ప్రతి రైతు కొనుగోళు కేంద్రాన్ని వినియోగించుకోవాల న్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు రాగి సంధ్య ఉమామహేశ్వర్, మల్లేశం, బోయిని లత స్వామి, పిట్ల రాధమ్మ, ఎంపీటీసీలు బానోత్ బుజ్జి, మైలారం శ్యాములు, మల్లన్నగారి నాగులు, పీఏసీఎస్ సీఈఓ పుట్టి నర్సింలు, కార్యదర్శి శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.