Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కసారిగా మృత్యువాత పడుతున్న మూగజీవులు
- ఆందోళనలో రైతులు, పశుకాపరులు
- అవగాహన కల్పించడంలో పశువైద్యులు విఫలం
నవతెలంగాణ-న్యాల్కల్
పశువుల్లో రోజురోజుకూ కొత్తగా పుట్టుకొస్తున్న వింత వ్యాధులు రైతన్నను, పశువుల కాపరులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒక్కసారిగా పశువులు మృత్యువాత పడుతుండడంతో రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇతర రాష్ట్రాల్లో ఇటీవలే చాలా వేగంగా వ్యాప్తి చెందిన లంపీస్కిన్ వ్యాధి ఇప్పుడు జిల్లాలోకి విస్తరించి రైతన్నను ఆగమాగం చేస్తున్నది. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మండలాల్లో ఈ వ్యాధి ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉన్నది.
న్యాల్కల్ మండలంలోని ఖలీల్పూర్, రేజింతల్, న్యాల్క ల్, చాల్కి మండలంలోని వివిధ గ్రామాల్లో పశువులకు, గొర్రెలకు, ఆవులకు లంపిస్కిన్ వ్యాధితో వ్యాపించి దడ పుట్టిస్తున్నది. ఈ వ్యాధి చాలా వేగంగా వాపిస్తుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే అవగాహన కల్పించాల్సిన పశువైద్యులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారు. రైతులకు కనీస అవగాహన లేకపోవడంతో.. ఈ వ్యాధి మరింత వేగంగా విస్తరిస్తున్నది. పశువులు, గొర్రెలు మృత్యువాత పడినప్పటికీ.. వైద్యులు పట్టించుకోవట్లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. మిర్జాపూర్ (బి) పశు వైద్య కేంద్రంలో ఎన్నో నెలలు నుంచి వైద్యుడే లేడని.. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు, పశుపోషకులు ఆరోపిస్తున్నారు. పశువుల ఆసుపత్రి ఎల్లప ు్పడు తాళంతోనే దర్శనమిస్తున్నదని.. ఆసుపత్రి ఎదుట పడిగా పులు కాస్తున్నా.. ఫలితం లేకుండా పోయిందని వారు మండిపడుతున్నారు. జిల్లా పశు వైద్యాధికారిని వివరణ కోర గా.. ఇంచార్జ్ డాక్టర్ను మిర్జాపూర్ (బి) ఆసుపత్రికి నియమించినట్టు తెలిపారు.