Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారం రోజులైనా తూకం వేయని వైనం
- తేమ సాకుతో కొనుగోలు నిలిపివేత
- తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు
నవతెలంగాణ-పుల్కల్
పుల్కల్ ఉమ్మడి మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను 15 రోజులు క్రితమే అట్టహాసంగా ప్రారంభించారు. కానీ నేటి వరకు కొనుగోళ్లు మాత్రం చేపట్టలేదు. దీంతో కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం ఒక్కసారిగా మారుతుండడంతో రైతన్న ఆందోళన చెందుతు న్నాడు. కొనుగోలు చేయడంలో నిర్లక్ష్య ధోరణి వ్యవహరిం చడం ఎంతవరకు సమంజసమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ధాన్యన్ని సెంటర్కు తరలిస్తే.. కొనుగోళ్లు ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నదని అందుకే కొనుగోలు చేయట్లేదని నిర్వాహకులు కుంటి సాకులు చెబుతున్నారన్నారు. తేమ శాతం చూసే యంత్రాలు సరిగ్గా లేవని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవిం చినా.. ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. లేనియెడల రైతుల మంతా ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.