Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి
- సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సింహారెడ్డి
నవతెలంగాణ-రామచంద్రాపురం
ఈఎస్ఐ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, వెంటనే ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సింహరెడ్డి అన్నారు. సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రామచంద్రపురంలోని ఈఎస్ఐ కార్మికులతో కలిసి శుక్రవారం గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈఎస్ఐ కార్మికులకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్ కచ్చితంగా అమలు చేయాలన్నారు. ప్రతీనెల సక్రమంగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 12 ఏండ్లుగా పనిచేస్తున్న కార్మికులను కార్మికులుగా గుర్తించడం లేదని, కార్మికులకు ఏ నెలకు ఆనెల జీతం ఇవ్వడం లేదని, ఈఎస్ఐలో పనిచేస్తున్నా ఇప్పటికి ఈఎస్ఐ, పీఎఫ్ కట్టకుండా కాంట్రాక్టర్లు కార్మికులకు ఇబ్బందులు పెడుతున్నారన్నారు. సంబంధిత అధికారులు పట్టించు కోకుండా కార్మికులను చులకనగా చూస్తున్నారన్నారు. కార్మి కుల సమస్యల పట్ల నికరంగా నిలబడి పోరాటం చేసేది సీఐ టీయూ అనే అన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టు విధానం రద్దు చేయాలని, కార్మికుల కనీస వేతనాలు పెంచాలని, కార్మిక చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని, అనేక సమ్మెలో పోరాటాలు చేసిన చరిత్ర సీఐటీయూకు ఉన్నదన్నారు. ఈఎస్ఐ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించాలని, వారిని పర్మినెంట్ చేయాలని కనీస వేతనం పెంచాలని, ఈఎస్ఐ, పిఎఫ్ తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ యూనియన్ నాయకులు సురేష్, యాదయ్య,దశరథ్ సిద్దు, సంతోష, ప్రమేల, గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు.