Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘం జిల్లా కార్యదర్శి జయరాజు
నవతెలంగాణ-సంగారెడ్డి
నవంబర్ 16న సంగారెడ్డిలో జరుగనున్న తెలంగాణ రైతు సంఘం సంగారెడ్డి రెండో మహాసభలను విజయ వంతం చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం మహాసభలకు సంబందించిన కరపత్రాలను నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేసినప్పటికి.. ఇంకా మెడమీద కత్తిలా వాటిని అమలు చేసేందుకు కుట్ర చేస్తున్న దన్నారు. రైతులకు దేశ వ్యాప్తంగా ఒకేసారి పంట రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఆరుగాలం పండించిన పంటలకు మద్దత్తు ధర కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలం అయిందన్నారు. ఎరువుల ధరలు పెంచి రైతులపై భారాలు మోపుతున్నదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల రైతు వ్యతిరేక విధానాలపై, రైతాంగ సమస్యలపై ఈ మహాసభలో చర్చించి తీర్మానాలు ఆమోదం చేస్తారన్నారు. రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహ రెడ్డి,రైతు నాయ కులు మహి పాల్ రెడ్డి, దశరథ, రత్నయ్య పాల్గొన్నారు.