Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణఖేడ్
పురుగులు ఉన్న అటుకులను తిని అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కస్తూర్భా పాఠశాల విద్యా ర్థులను ఆసుపత్రికి వెళ్లి పలువురు నాయకులు పరామ ర్శించారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ బాధిత విద్యార్థులను పరామర్శించి.. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లక సూచించారు. ఆయనతో పాటు పీసీసీ సభ్యులు శంకరయ్య స్వామి, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ కొప్సాన్ సభ్యులు రషీద్, నారాయణఖేడ్ మండ ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తహీర్ అలీ, నారాయణ ఖేడ్ పట్టణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిలు పటేల్ తదితరులు పాల్గొన్నారు.
టీపీసీసీ సభ్యులు డా.పట్లోల సంజీవ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధిత విద్యార్థులను పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్య లు తీసుకోవాలన్నారు. ఆయనవెంట పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు వినోద్ పటేల్, నారాయణఖేడ్ కాంగ్రెస్ పార్టీ మునిసిపల్ ప్లోర్ లీడర్ దారం శంకర్ సెట్, కౌన్సీలర్లు రాజేష్ చౌహన్, హన్మడ్లు, జ్ఞానేశ్వర్ పాటిల్, ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం అందించడంలో వైద్యులూ విఫలం :
ప్రజా సంఘాల ఆరోపణ
ఫుడ్ పాయిజన్‌తో ఆసుపత్రికి వచ్చిన విద్యార్థులకు వైద్యం అందించడంలో ఏరియా ఆసుపత్రి విఫలమైం దన్నా రు. సమయానికి వైద్యులు అందుబాటులో లేరని.. దానికి తోడూ సూపరింటెండెంట్ కూడా అందుబాటులో లేకపో వడంతో విద్యార్థులకు సరైన వైద్యం అందలేదని కేవీపీఎస్ రాష్ట్ర కమిటి సభ్యులు కోటారి నర్సింలు, సీపీఐ(ఎం) ఏరియా కన్వీనర్ యస్.చిరంజీవి, అంబేద్కర్ యువజన సంఘాల డివిజన్ అధ్యక్షులు బి,కన్షీరాం, కేవీపీఎస్ జిల్లా నాయకులు యం.మోషప్ప, ఎసఎఫ్ఐ నాయకులు యం. డి.రిహజ్, సంగయ్య, కేవీపీఎస్ ఖేడ్ డివిజన్ నాయ కులు టి.రాజ్ కుమార్ జి,సంజివు కుమార్,తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అంజా గౌడ్, నారాయ ణఖేడ్ డివిజన్ అధ్యక్షులు భూమా గౌడ్ ఆరోపించారు. వారందరూ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు.
బహుజన సమాజ్ పార్టీ నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షుడు అలిగే జీవన్ కుమార్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు.ప్రిన్సిపాల్ రాజేశ్వరి, ఉపాధ్యాయ సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మనూర్ మండల కన్వీనర్ తుకారం, ఇషాక్, సంజీవ్, మంగలి ఉశయ్య తదితరులు పాల్గొన్నారు.
డీఈఓని వెంటనే సస్పెండ్ చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు రామావత్ సురేష్ నాయక్ డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా హాస్టల్ విద్యార్థులకు సరైన భోజనాలు పెట్టక, సరైన వసతులు లేక కల్పించిక, పాచిపోయిన కూరగాయలు, ఉడికి ఉడకని అన్నం పెట్టడంతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇంతజరుగుతున్నా డీఈఓ చూసినట్టు చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. డీఈఓ, కళశాల ప్రిన్సిపల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.