Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
- రూ.4.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-రామచంద్రాపురం
మన ఊరు-మన బడి పథకం ద్వారా విద్యారంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు, తెలా పూర్, బీహెచ్ఈఎల్, రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని జెడ్పిహెచ్ఎస్, ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగు కోట్ల 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టన ున్న అదనపు తరగతుల గదుల నిర్మాణం, మరమ్మత్తు పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మన ఊరు-మనబడి పథకం ద్వారా పటాన్చెరు నియోజక వర్గ పరిధిలోని 55 ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. పూర్తి పారదర్శకతతో పాఠశాలల అవసరాలకు అనుగుణంగా పనులు చేపడుతున్నామన్నారు. అత్యున్నస్థాయి ప్రమాణాల తో కూడిన ఫర్నిచర్, అదనపు తరగతి గదుల నిర్మాణం, ప్రహరీలు, వంటశాలలు, పెయింటింగ్ తదితర పనులు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణ మూలంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తోందన్నారు. అన్ని పరీక్షల్లోనూ అత్యు త్తమ ఫలితాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు. కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్ యాదవ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, నగేష్, ఎంఈఓ జెమినీ కుమారి, పంచాయతీరాజ్ డిప్యూటీ ఈఈ సురేష్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వెలిమలలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..
తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వెలిమెలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జిఎం ఆర్ ప్రారంభించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి, రైతు ఆర్థిక అభ్యున్నతికి కృషి చేసిన మహౌన్నత నాయ కుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. మార్కెట్ కమిటీ చైర్మెన్ విజరు కుమార్, మున్సిపల్ చైర్మెన్ లలితా సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, పీఏసీఎస్ చైర్మెన్ బుచ్చిరెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.