Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సదాశివపేట, కంది
ఆరుగాలం కష్ట పడి పండించిన రైతన్న గిట్టుబాట ధర లేక నష్టపోవద్దనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ చింతా ప్రభాకర్, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ వైస్ చైర్మెన్ పట్నం మాణిక్యం అన్నారు. సదాశివపేట మార్కెట్ ఆఫీస్‌లో డీసీసీబీ (సొసైటీ) ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని శనివారం వారు ప్రారంభించారు. అనంతరం చింతా ప్రభాకర్ మాట్లా డుతూ.. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తున్నదన్నారు. అందుకే రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని రైతులకు సూచించారు. రైతుల తరుపున సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిb ారు. తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, ఎంపీడీఓ పూజ, స్థానిక సోసైటీ చైర్మెన్ రత్నాకర్‌రెడ్డి, వైస్ చైర్మెన్ పాండు నాయక్, ఎంపీపీ తొంట యాదమ్మ, కిష్టయ్య, ఎంపీటీసీలు సునీత, సుధాకర్, అల్లం లలిత తదితరులు పాల్గొన్నారు.
కంది మండల కేంద్రంలోని ప్రాథమికవ్యవసాయ సహ కార సంఘం చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మెన్ చింతా ప్రభాకర్ వరిదాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. అనంతరం ఇంద్రకరణ్, చిదురుప్ప, కలివేముల గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సం దర్బంగా మాట్లాడుతూ..ఏ గ్రేడ్ వరి ధాన్యానికి రూ.2060, బీ గ్రేడ్‌కు రూ.2,040 రూపాయలుగా ప్రభు త్వం కేటాయించిందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, సీడీసీ చైర్మెన్ కాసాల బుచ్చిరెడ్డి, జెడ్పీటీసీ కొండల్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మెన్ కృష్ణ గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి తదితరాలు పాల్గొన్నారు.