Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పటాన్చెరు డివిజన్ పరిధిలో ఐదు కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం
- పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
నవతెలంగాణ-పటాన్చెరు
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు డివిజన్లో సీసీరోడ్ల అభివృద్ధి కోసం జిహెచ్ఎంసీ ద్వారా ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో రూ.80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీరోడ్డు నిర్మాణ పనులకు శనివారం ఉదయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి పరిధిలోని మూడు డివిజన్ల పరిధిలో సీసీరోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటారు ుంచినట్లు తెలిపారు. ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పన కు నిధులు కేటాయిస్తున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి వెన్నంటి నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజరు కుమా ర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, బసవేశ్వర్, శ్రీధర్ చారి, వెంకటేష్, షకీల్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.