Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రజిత
నవతెలంగాణ-హుస్నాబాద్
మహిళా శిశు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత అన్నారు. శనివారం ఆమె హుస్నాబాద్‌లోని ఆరెపల్లిలో ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు, అంగన్వాడీ కేంద్రంలో గుడ్లు, బాలామృతాన్ని పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆరోగ్యలక్ష్మి పథకం కింద ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తోందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమావళికి అనుగుణంగా గర్భిణులు, బాలింతలకు పోషక విలువలు ఉన్న ఆహారాన్ని అందిస్తోందని చెప్పారు. తీవ్రమైన పోషకాహార లోపంతో ఉన్న పిల్లల ఆరోగ్య సంరక్షణకు బాలామతం కార్యక్రమం ద్వారా ప్రత్యేక పర్యవేక్షణతోపాటు అదనపు ఫీడింగ్ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ కషి ఫలితంగా మాతా శిశు మరణాల రేటు తగ్గుతోందన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అయిలేని అనిత, కౌన్సిలర్ మ్యాదరబోయిన వేణు, కోఆప్షన్ సభ్యురాలు శ్రీలత, ప్రధానోపాధ్యాయుడు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.