Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
- మహాసభల వాల్పోస్టర్ విడుదల
నవతెలంగాణ-సంగారెడ్డి
డిసెంబర్ 21 నుండి 23 వరకు సిద్దిపేట పట్టణంలో జరగనున్న సీఐటీయూ రాష్ట్ర నాల్గో మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పిలుపునిచ్చారు. ఈ మేరకు సంగారెడ్డిలో శనివారం మహాసభల వాల్పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలతో కార్మికులకు రక్షణ లేదన్నారు. మహాసభల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు, శ్రేయోభిలాషులు, కార్మికులు, ఉద్యోగులు, తమ ఆర్ధిక, హర్థిక సహాయ సహకారాలు అందించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు, మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా నిరంతరం కార్మికులను, ప్రజలను చైతన్యం చేస్తూ ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాలని, కార్మిక హక్కులను రక్షించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రోజుకు రూపాయలు 178 ఉండాలని పార్లమెంట్ సాక్షిగా మోడీ ప్రభుత్వ ప్రకటించడం సిగు చేటన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై మోయలేని భారాలు వేస్తుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ పరిశ్రమలో కనీస వేతనాల పెంపుదల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. అసంఘటిత కార్మికుల సమస్యలతొ పాటు స్కీం వర్కర్లు, తదితర రంగాల కార్మికుల్లో వస్తున్న సమస్యలపై సీఐటీయూ ముందుండి పోరాడుతుందన్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట పట్టణంలో సిఐటియు తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు నిర్వహించడం జరుగుతుందని ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. సీఐటీయూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం, ఉపాధ్యక్షులు కే రాజయ్య, నాయకులు జి. జయరాజు, బి. రాంచందర్, ఏ.మానిక్, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.