Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూనియర్ సివిల్ జడ్జ్ శివరంజని
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
ఎలాంటి కేసులలోనైనా కోర్టుకు సమర్పించే ఆధారాలతోనే తీర్పు ఇవ్వాల్సి వస్తుందని హుస్నాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జ్ శివరంజని అన్నారు. శనివారం హుస్నాబాద్ మండలంలోని పందిళ్ళ గ్రామంలో హుస్నాబాద్ కోర్టు ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి శివరంజని మాట్లాడుతూ జీవితంలో కొన్ని సందర్భాలలో ఓపిక లేక తొందరపాటు నిర్ణయాలతో సంఘటనలు చోటు చేసుకుంటయన్నారు. డబ్బులు సమయం వథా చేసుకోకుండా వివేకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. క్షణికావేశంలో చేసిన తప్పులతో పోలీస్ స్టేషన్ కోర్టుల చుట్టూ తిరిగి తమ అమూల్యమైన సమయాన్ని వథా చేసుకోవద్దన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను ఇరువురు కక్షిదారులు సత్వర పరిష్కారం చేసుకోవచ్చన్నారు. లీగల్ సర్వీసెస్లో రూ.4.50 లక్షలలోపు సంవత్సరం ఆదాయం ఉంటే ఫ్రీగా కోర్టు కేసు వాదించేలా లాయర్ నియమిస్తామన్నారు. అనంతరం జడ్జి శివరంజనికి మహిళలు సన్మానం చేశారు. కార్యక్రమంలో ఏ జి పి కన్నోజు రామకృష్ణ ,సర్పంచ్ తోడేటి రమేష్, ఎంపీటీసీ బాణాల జయలక్ష్మి న్యాయవాదులు ఒగ్గోజు సదానందం, జేరిపోతుల కిరణ్, దికొండ ప్రవీణ్ ,ఉప్పరపల్లి సంపత్, సావుల రాజశేఖర్ ,సబ్బని శ్రీదేవి , చింతకింది భాస్కర్, జూమ్లా నాయక్ ,షీ టీం ఏఎస్ఐ మల్లేశం, కానిస్టేబుల్ రజిత, దూదియా నాయక్, రవి నాయక్, మొగిలే నాయక్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.