Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-నంగునూరు
రాష్ట్రంలోని 65 లక్షల రైతుల సంక్షేమమే ముఖ్యమని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.30 వేల కోట్ల కోసం మోటార్లకు మీటర్ల పెట్టమని సీఎం కేసీఆర్ చెప్పారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఐకేపీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత యాసంగీ కాలంలో వరిధాన్యాన్ని కొనాలని కేంద్ర ప్రభుత్వా న్ని అడిగితే... నూకలు ఎక్కువగా వస్తాయని రాష్ట్ర ప్రజలతో నూకలు తినిపించాలని కేంద్ర మంత్రులు అవమానించార న్నారు. రాష్ట్ర ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేసి వారం రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశామన్నా రు. సీఎం కేసీఆర్ రైతన్నల కోసం రాష్ట్రంలోని పెండింగ్ ఇ రిగేషన్ ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, వాగులు, నదులపై చెక్ డ్యా ముల నిర్మాణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా భూగర్భ నీటి వనరులు వృద్ధి చెంది కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం ఒక సీజన్లోనే పండుతోందన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికీ జిల్లాలో లక్ష నుంచి లక్షన్నర మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండితే ప్ర స్తుతం ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతోం దన్నారు. రంగనాయక సాగర్ నింపి ఆ నీటిని జిల్లాలోని అన్ని చెరువుల్లో నింపి పొలాలకు నీటిని అందిస్తుంటే కొందరు హైదరాబాద్‌లో కూర్చుని కాళేశ్వరం ఫలితం రాలేదని ఎద్దేవా చేస్తున్నారన్నారు. హైదరాబాద్ వదిలి గ్రా మాల్లో తిరిగితే పచ్చని పల్లెలలో ఉండే రైతులు సమాధానం చెప్తారని హెచ్చరించారు.
రంగనాయక సాగర్‌తో అన్ని గ్రామాల్లో చెరువులు, పంట పొలాలను నింపుతున్నామ న్నారు. ఈసారి పెద్ద వాగులోకి నీటిని వదిలి చెక్ డ్యాము లను నింపుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,060 మద్దతు ధర నిర్ణయించిందన్నారు. ధాన్యం విక్రయించిన మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ అయ్యేలా ప్రభుత్వం నిధులను సమకూర్చిం దన్నారు. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి తప్ప రాజకీయం కోసం కాదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల మిల్లర్లు వరిధాన్యం కొనేందుకు రాష్ట్రానికి వస్తున్నారన్నారు. ఇతర ప్రాంతాల వ్యవసాయ కూలీలకు అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతిని చూసి ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం రైతుల బావుల వద్ద మోటార్లకు మీటర్ పెట్టి బిల్లులు వసూలు చేస్తేనే రాష్ట్రానికి ఇచ్చే రూ.30 వేల కోట్లు ఇస్తామని చెబుతున్నారన్నారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోటార్లకు మీటర్లు పెట్టడానికి ఒప్పుకొని వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఎకరానికి రూ.4 లక్షలు ఉన్న భూమి విలువ ప్రస్తుతం రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పెరిగిందన్నారు. వరిధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ గోపాల్ రావు, సివిల్ సప్లై డీఎం హరీష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాగుల సారయ్య, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, ఎంపీడీవో వేణుగోపాల్, సొసైటీ చైర్మన్లు ఎల్లంకి మహిపాల్ రెడ్డి, కోల రమేష్ గౌడ్, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ బద్దిపడగ కిష్టారెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఆనగోని లింగం గౌడ్, ఐకేపీ ఏపీఎం ఆంజనేయులు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు ఎడ్ల సోమిరెడ్డి, వేముల వెంకట్ రెడ్డి సంగు పురేందర్, టిఆర్ఎస్వీ మండల శాఖ అధ్యక్షులు గోవిందారం రవి, తడిసిన వెంకట్ రెడ్డి, డాకూరి భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీ బెదురు తిరుపతి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిప్పని నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.