Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జహీరాబాద్
జహీరాబాద్ పట్టణంలోని రహమత్‌నగర్‌లో నిర్మించిన 312 ఇండ్లకు పట్టణంలోని రంజోన్ రైతు వేదికలో శుక్రవారం డ్రా నిర్వహించారు. లబ్ధిదారుల ముందు ఆర్డిఓ రమేష్ బాబు, తహసీల్దార్ స్వామి దీప్తి, తహసిల్దార్ కిరణ్ కుమార్‌లు లాటరీ డ్రా పద్ధతిలో నిర్వ హించారు. మొత్తం లబ్ధిదారులు 2375 ఉండగా అందులో రహమత్ నగర్లో నిర్మించిన 312 ఇండ్లకు మాత్రమే డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రమేష్ బాబు మాట్లాడుతూ.. లబ్ధిదారులందరికీ త్వరలోనే గృహప్రవేశం నిర్వహిస్తామన్నారు. ఈ ప్రవేశ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు హాజరవుతారన్నారు. మరో 700 ఇండ్లు హోతి(కే)లో నిర్మిస్తున్నారన్నారు. వాటి నిర్మాణం పూర్తయిన వెంటనే మిగతా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల నుండి స్వీకరించిన దరఖా స్తులను పూర్తిస్థాయిలో విచారణ జరిపించి 2375 మందిని లబ్ధిదారులను అర్హులుగా అధికారులు నిర్ధారించారన్నారు.