Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
భారత ప్రభుత్వ సంస్థ మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ప్రతిష్టాత్మకంగా నవంబర్ 9న నిర్వహిస్తున్న 'నేషనల్ ఎంట్రప్రెన్యూర్షిప్ డే'ను సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ తెలంగాణ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల పోటీల్లో ఎఫ్.సి.ఆర్.ఐ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో భాగంగా గురువారం అటవీ కళాశాల, పరిశోధన సంస్థ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎన్.ఎస్.శ్రీనిధి పర్యవేక్షణలో విద్యార్థులు తమ కళాశాలలో పెంచిన గంధపు మొక్కలను సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో, అచ్చాయిపల్లి గ్రామాల్లో విక్రయించారు. గంధపు మొక్కల ప్రాధాన్యత, వాటిని పెంచే పద్ధతులు, వాటిని విక్రయించే ఏజెన్సీ కేంద్రాల సమాచారం, వాటి విక్రయాల వచ్చే లాభాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేలా పోస్టర్లను, ప్లకార్డులను ప్రదర్శించారు. గ్రామస్థులు మొక్కలను ఉత్సాహంగా కొనుక్కున్నారు. ఈ సందర్భంగా ఎన్.ఎస్. శ్రీనిధి మాట్లాడుతూ ప్రజలకు మొక్కల పెంపకంపై విద్యార్థులు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. కళాశాల డీన్, సీఎం ఓఎస్డి ప్రియాంక వర్గీస్ సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.శివపుత్ర, ములుగు గ్రామ సర్పంచ్ మాధవి అంజిరెడ్డి, అచ్ఛాయి పల్లి గ్రామ సర్పంచ్ రాంచంద్రం తదితరులు పాల్గొన్నారు.