Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుబ్బాక రూరల్
సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలతో పోటీగా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, అడ్డుపడితే ఎంతటివారైనా ప్రశ్నిస్తానని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను గెలిచిన ఏడాదిలో దుబ్బాక వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తై ప్రారంభించుకున్నామని ,త్వరలోనే దుబ్బాక రింగ్ రోడ్డు నిర్మాణ సంబంధించి మాస్టర్ ప్లాన్ పూర్తయిందన్నారు. మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ నివేదికను బోర్డు పొందుపరిచి పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ నియోజకవర్గంలో 2018 నాటికి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తైన పంపకాలు జరగలేదని, తాను గెలిచాక ఇక్కడి ప్రజలు అద్దె ఇళ్లల్లో ఉంటూ కిరాయిలు చెల్లించలేని స్థితిలో ఉన్నామని, తనతో గోడు వెళ్లబోసుకుంటే దగ్గరుండి వారికి అన్ని సదుపాయాలు కల్పించి లబ్ధిదారులతో గహ ప్రవేశాలు చేపిస్తే.....ఈ గహ ప్రవేశాల్లో ఇక్కడి టీఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవాలు జరిపి తమపై విమర్శలు చేశారని ఆరోపించారు. తాను గెలిచాక 30 లక్షలు ఖర్చు చేసి ఇక్కడి యువతకు అనుభవజ్ఞులైన లెక్చరర్లతో టెట్ ,ఎస్ఐ కోంచింగ్ అందించామన్నారు.హబ్సిపూర్ చౌరస్తా నుంచి దుబ్బాక వరకు 4 లైన్ల రహదారి ఏర్పాటుకు 3 సార్లు ముఖ్యమంత్రికి, దుబ్బాకకు వచ్చిన ప్రతిసారి మంత్రిహరీష్ రావులకు లేఖలు అందించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దుబ్బాక నియోజకవర్గానికి కేంద్రం నుండి 40కోట్లు సిఆర్ఎఫ్ నిధుల మంజూరు కాగా.. దుబ్బాక నుండి ముస్తాబాద్ వరకు18 కోట్ల డబుల్ రోడ్డు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా ధర్మారం నుండి దుంపలపల్లి వరకు 22 కోట్ల నిధులు తెచ్చామన్నారు.2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో నిరుద్యోగ యువతకు ఇస్తానన్న నిరుద్యోగ భతి త్వరలోనే అందజేస్తామని చెప్పారు.ఇక తనను విమర్శించిన విజ్ఞతకే వదిలేస్తున్ననని అలాంటి వారికి కాలమే సమాధానం చెబుతోందని పేర్కొన్నారు. దుబ్బాక అభివద్ధిలో తనతో కలిసి వచ్చేవారికి పార్టీలకు అతీతంగా సహకరిస్తానని, అభివద్ధి అడ్డుకునే వారు ఎంతటివారైన ప్రశ్నిస్తానని వెల్లడించారు. ఆ తర్వాత పలువురు ఎమ్మెల్యే బిజెపి నాయకులు శాలువాతో సన్మానించారు కార్యక్రమంలో కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటిి బాలేష్ గౌడ్, బిజెపి రాష్ట్ర నాయకులు చింత సంతోష్ , బీజేవైఎం మాజీ జిిల్లా అధ్యక్షుడు, నాయకులు ఎస్.ఎన్ చారి, మచ్చ శ్రీనివాస్, పుట్ట వంశీ, అశోక్,సుంకు ప్రవీణ్ తదితరులు ఉన్నారు.