Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- గజ్వేల్
ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులు, గజ్వేల్ నియోజకవర్గం ముఖ్య నాయకులు ఉడేము కృష్ణారెడ్డికి నామినేట్ కోసం ఆయన అనుచరులు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో నామినేట్ పదవి దక్కుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిల కృషితో పార్టీ బలోపేతానికి 2001 నుంచి కషి చేస్తున్నారని ఆయన అనుచరులు అంటున్నాయి. పార్టీ ఆవిర్భావం రోజున గజ్వేల్ ప్రాంతంలో టీఆర్ఎస్ జెండా పట్టాలంటే ఎవరూ ముందుకు రాలేదని, ఆ రోజు కృష్ణారెడ్డి మరికొందరు వ్యక్తులు టీఆర్ఎస్ జెండాను గజ్వేల్‌లో ఎగురవేశారని గుర్తు చేస్తున్నారు. టీఆర్ఎస్లోకి వచ్చిన చాలామంది జూనియర్లకు అధిష్టానం నామినేట్ పదులతో పెద్దపీట వేసిందని గుర్తుచేస్తున్నారు. గజ్వేల్ ప్రాంతంలో సీనియర్ కృష్ణారెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిల్ టికెట్ ఇచ్చినప్పటికీ స్వల్ప ఓట్లతో ఓటమి చెందారు. అయి నప్పటికీ దూరం ఉండ కుండా పార్టీ కార్యక్ర మాలను విజయవం తాని కి కృషి చేస్తున్నారని కార్యక ర్తలు అంటున్నారు. నామి నేట్ పదవి కృష్ణారెడ్డికిచ్చి తీరాలని ఆయన వర్గీ యులు పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్ర భుత్వ పద ¸కాలను ప్రజల దరికి చేర్చడానికి తనవంతు కృషి చేస్తున్నారని కార్యకర్తలు పేర్కొంటున్నారు. 2014, 2018 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు, మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో కృష్ణారెడ్డి పాల్గొన్నారని అంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి విజయానికి కృషి చేశారని చెబుతున్నారు.