Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతి
నవ తెలంగాణ-సిద్దిపేట
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం వెంటనే మధ్యాహ్న భోజనం అందించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జేరిపోతుల జనార్ధన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సంగెం మధు కోరారు. గురువారం ఆర్డీవో ఆనంతరెడ్డికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం పెట్టాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు అర్ధాకలితో అలమాటిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలలో చదువే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడతామని చెప్పి నేటికి 6 సంవత్సరాలు అయితున్నప్పటికీ ఆ హామీని అమలు చేయడం లేదన్నారు. గతంలో ఎన్నికల ముందు జిల్లాలో కొన్ని చోట్ల స్థానిక ఎమ్మెల్యేలు స్వంత ఖర్చులతో తూతుమంత్రంగా పెట్టించి చేతులు దులిపేసుకున్నారని తెలిపారు. ఎదుగుతున్న విద్యార్థులకు సమయానికి తినకుండా ఉంటే అనారోగ్యానికి గురవుతారన్నారు. ఇప్పటికైనా మంత్రి హరీశ్‌రావు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరాఉ. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ నాయకులు ఎండి ఇస్మాయిల్, ఆదిత్య, షఫీ, ప్రవీణ్, హావేజ్ లు పాల్గొన్నారు.