Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్
నవతెలంగాణ-ప్రజ్ఞాపూర్
రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు. గురువారం గజ్వేల్ మండలం పరిధిలోని శ్రీగిరిపల్లి , అక్కారం, కొడకండ్ల గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మల్లేశం, తెరాస మండల అధ్యక్షుడు బెండే మదు, సర్పంచ్ల ఫోరమ్ మండల అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి,మాజీ ఎంపీపీ మల్లయ్య, ఏవో నాగరాజు, సర్పంచ్ బాల్ చంద్రం, విజయ ,తెరాస మండల కార్యదర్శి రమేష్ గౌడ్ , ఎంపీటీసీ అశోక్,ఏపీఎంయాదగిరి,ఐకేపీ సీసీ రమేష్ రెడ్డి,తెరాస నాయకులు దేవేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, పొట్ట యాదగిరి,బాల్ రాజు, భాస్కర్, రాజు, వెంకట్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.