Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిద్దిపేట
23 వార్డులో చెత్తను పారవేసే బ్లాక్ స్పాట్ల వద్ద చెత్తను తొలగించి అక్కడ మొక్కలను ఏర్పాటు చేయ డం జరిగిందని శానిటరీ ఇన్స్పెక్టర్ వనిత, వార్డు కౌన్సిలర్ నాయకం లక్ష్మణ్ తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ ఇంటింటికి వచ్చే మున్సిపల్ వాహనాలకే చెత్తను ఇవ్వాలని, పట్టణంలో ఎక్కడ కూడా పార వేయవద్దని సూచించారు. తడి, పొడి ,హానికర చెత్తను వేరువేరుగా మున్సిపల్ వాహనాలకు అందించాలని కాలనీవాసులను కోరారు. బ్లాకు స్పాట్ల వద్ద ఏర్పాటుచేసిన మొక్కలకు కాలనీవాసులు నీరు పోసి పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.