Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుబ్బాక
దుబ్బాక పురపాలిక పరిధిలోని ధర్మాజీపేట తొమ్మిదొవార్డుకు చెం దిన పలువురికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో మంజూరైన రూ.68,500 విలువ చేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను గురువారం పంపిణీ చేసినట్లు కౌన్సిలర్ బత్తుల స్వామి చెప్పారు. జనగామ కరుణాకర్‌కు రూ.18 వేలు, ఎర్రబాగు రాజేందర్‌కు రూ.30 వేలు, ఫిరంగి పోచమ్మకు రూ.20,500 విలువచేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశామన్నారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డికి కౌన్సిలర్ బత్తుల స్వామి ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గన్నె భూమిరెడ్డి,టిఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు కె.రవీందర్ గౌడ్,కొన్నేటి సుధాకర్ ఉన్నారు.