Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుబ్బాక
మత్స్యకారులను గత ప్రభు త్వాలు ఏనాడు పట్టించుకోలేవని, స్వరాష్ట్రం సాధించాక చేపల పిల్లల పంపిణీ ద్వారా మత్స్యకారుల ఆర్థి కాభివృద్ధికి సీఎం కేసీఆర్ సర్కారు కృషి చేస్తోందని సర్పంచ్ చింతల పద్మ ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలోని రామసముద్రం చెరువులో సిద్దిపేట జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 100 శాతం సబ్సిడీపై సరఫరా అయిన 75 వేల చేప పిల్లల్ని వదిలామన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ చేపల పెంపకం ద్వారా మత్స్యకారులు ఆర్థికాభివృద్ధిని సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఎంపీటీసీ సంగెపు శోభ స్వామి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్, రామక్కపేట మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు పూస దశరథం, ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్ గౌతమి, మత్స్య కార్మికులు పూస ఆగమయ్య, నర్సింలు, రాచకట్ల స్వామి, రంజిత్ పాల్గొన్నారు.