Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సాపూర్
ఈనెల 13న వాకిటి లక్ష్మారెడ్డి మెమోరియల్ పేరిట నియోజకవర్గస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు నిర్వహి స్తున్నట్టు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్, వాలీబాల్ టోర్నమెంట్ నిర్వాహకులు సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం నర్సాపూర్లోని ఆమె స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ.. నియోజకవర్గస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వాలీబాల్ టోర్నమెంట్ లో పాల్గొనాలనుకునే క్రీడాకారులు ఎలాంటి ఫీజు చెల్లిం చాల్సిన అవసరం లేదన్నారు. ఈనెల 11 వరకు క్రీడాకా రులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నియోజకవర్గస్థాయి వాలీబాల్ పోటీలు శివంపేట మండలంలోని గోమారంలో నిర్వహిస్తుండగా శివంపేట్ వెల్దుర్తి మాసాయిపేట మండలాలకు చెందిన గ్రామాల క్రీడాకారులు పాల్గొంటారన్నారు. అదేవిధంగా నర్సాపూర్ లోని బివిఆర్ఐటి కళాశాలలో నిర్వహిస్తున్న పోటీల్లో నర్సా పూర్, హత్నూర, కౌడిపల్లి, కొల్చారం, చిలిపిచిడ్ మండలాల వాలీబాల్ క్రీడాకారులు పాల్గొంటారన్నారు. ఈ వాలీబాల్ టోర్నమెంట్ ఈనెల 13న ప్రారంభమై 23 వరకు కొనసాగుతుందన్నారు. ఇందులో ప్రథమ బహుమతికి రూ.50 వేల, ద్వితీయ బహుమతికి రూ.35 వేల, తృతీయ బహుమతికి రూ.15 వేల, నాలుగో బహుమతికి రూ.5000 నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ 9912509900 మరియు 7386561178లకుు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. గ్రామీణ క్రీడాకార ులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. టీఆర్ఎస్ నాయకులు సత్యం గౌడ్, సూరారం నరసింహులు, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.