Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెదక్‌రూరల్
జిల్లాలో ఓటరు నమోదు సవరణలు, తొలగింపులు , ఆధార్ అనుసంధానం ప్రక్రియను ఎలక్టోరల్ పరిశీలకులు నిర్మల గురువారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నర్సాపూర్ ఆర్డిఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ రమేష్, ఆర్డిఓ సాయి రామ్, ముఖ్య నోడల్ అధికారి రాజిరెడ్డితో కలిసి తహసీల్ధార్లతో నిర్వహిం చిన సమీక్ష సమావేశంలో జిల్లాలోని మెదక్ నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు నమోదుకు స్వీప్ ద్వారా చేపట్టిన కార్యక్రమాల ప్రగతిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫారం-6 ద్వారా ఓటరు నమోదుకు సమర్పించిన దరఖాస్తులను బి.ఎల్.ఓ. లు గరుడ యాప్‌లో ఆన్ లైన్ వెంటనే చేయాలని సూచిం చారు. ఫారం-7 ద్వారా మరణించిన వారి పేర్లను ముందుగా నోటీసు ఇచ్చి డెత్ సెర్టిఫికెట్ తీసుకున్న తరుy ాత తొలగించాలని తిరిగి అవి ఓటరు జాబితాలో కనిపిం చరాదన్నారు. అదేవిధంగా మైగ్రేటెడ్ ఓటర్లను పరిశీలిం చాలని ఇటుక బట్టీలు తదితర ప్రాంతాలలో పనిచేస్తున్న వారిని ఓటరుగా నమోదు చేయాలన్నారు. పెండింగులో ఉన్న 1057 అభ్యంతరాలు క్లెయిమ్‌లను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఇంత వరకు 81 శాతం ఆధార్ కార్డు అనుసంధానం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మిగతా 19 శాతాన్ని ప్లూర్తి చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ.. జిల్లాకు వచ్చిన 11 వేల ఫోటో ఎపిక్ ఓటరు కార్డులను సంబంధిత అభ్యర్థులకు అందజేస్తామన్నారు. ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌లు కళాశాల అంబాసిడర్ల ద్వారా యువత లో అవగాహన కలి గించి మొబైల్ యాప్ ఏసిఐ పోర్టల్ ద్వారా అర్హులను ఓట రుగా నమోదు చేస్తున్నామన్నారు. తహసీల్ధార్లు, ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.