Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణఖేడ్
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని తెలంగాణ రాష్ట్ర అకాడమీక్ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. గురువారం నారాయణఖేడ్ జగనాథ్పూర్ లోని అశోక్ షేట్కార్ ఫామ్ హౌస్లో నూతన కార్యవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాకముందు రూ.10 కోట్లుకు 100 కోట్లు జమ అయ్యాయన్నారు. ఇప్పటివరకు 42 కోట్లు ప్రెస్ అకాడమీకి ఇచ్చారన్నారు. దాన్నుంచే డబ్బులను సంక్షేమానికి తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో టీయుడబ్ల్యూజె (హెచ్ )143 జనరలిస్టుల కోసం 42 కోట్లు ప్రభుత్వం జమ చేసిందని.. 17 కోట్లు వడ్డీ వచ్చిందని అన్నారు. 500 మందికి పింఛన్లు ఇవ్వడం జరిగిందన్నారు. అంతేకాకుండా జర్నలిస్టు కుటుంబంలోని పిల్లలను 10వ తరగతి చదివిస్తున్నామన్నారు. ఇప్పటివరకు రూ.25 కోట్లు జర్నలిస్టుల చికిత్స కోసం ఖర్చు పెట్టామన్నారు. రాజకీయ నాయకులను కలిపి ఏకం చేసి తెలంగాణ సాధించుకున్నా మన్నారు. జర్నలిస్టులకు ఒత్తిడితో బ్రెయిన్ ఎమ్మరేజ్, గుండెపోటు వస్తుందన్నారు. జర్నలిస్టులు మద్యానికి ఎక్కు వగా దూరం ఉండాలన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాకు హక్కు లు లేవని, ప్రింట్ మీడియాకి హక్కులు ఉన్నాయన్నారు.