Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేగుంట
ఈ యాసంగి పంటలో వరి నారు మడిని బాగా దున్ని మూడుసార్లు దమ్ము చేసి చదును చేయాలని, నీరు పెట్టడానికి తీయడానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసి ఎత్తు నారు మడులను తయారు చేసుకోవాలని చేగుంట మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ అన్నారు. చేగుంట మండలంలోని ఉల్లి తిమ్మయిపల్లీ గ్రామంలో గురు వారం రైతుల వరి నారు మడులను పరిశీలించారు. వ్యవ సాయ అధికారి హరి ప్రసాద్ మాట్లాడుతూ.. వరి నారు మడి యాజమాన్య పద్ధతులు రైతులకు వివరించడం జరిగిం ది. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి వారు మాట్లాడ ుతూ రెండు గుంటల (5 సెంట్లు) నారుమడికి 2 కిలోల నత్రజని (1కిలో విత్తనం చల్లేముందు, మరో కిలో విత్తిన 12-14 రోజులకు), 1 కిలో భాస్వరం మరియు 1 కిలో పొటాష్ నిచ్చే ఎరువులను దుక్కిలో వేయాలన్నారు. పశువుల పేడను లేదా ఇతర సేంద్రియ ఎరువులను దుక్కిలో వేయడం చాలా మంచిదన్నారు. మొలక కట్టిన విత్తనాన్ని చల్లి, మొదట్లో (వారం రోజులు ఆరు తడులు ఇచ్చి, ఆ తర్వాత మొక్క దశలో పలుచగా (2-3 సెం.మీ.) నీరు ఉంచాలన్నారు. జింకు లోప సవరణకు లీటరు నీటికి 2గ్రా. జింకు సల్ఫేటు కలిపిన ద్రావణాన్ని పిచికారి చేయాలి. మెట్ట నారు మడిలో ఇనుప ధాతు లోపాన్ని గమనిస్తే సరిచేj ూలన్నారు. పంట/మొక్క వయసు మరియు ఎదుగుదలను బట్టి 2 నుండి 5గ్రా. అన్నభేది ం0.5 నుండి 1గ్రా. నిమ్మ ఉప్పు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. నారు పీకే 7 రోజుల ముందు గుంట నారుమడికి (2.5 సెంట్లకు) 400గ్రా. కార్బోప్యూరాన్ 3జి గుళికలు ఇసుకలో కలిపి చల్లి పలుచగా నీరుంచాలన్నారు. అవసరాన్ని బట్టి మడిలో ఇతర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి నాట్లు ఆలస్యమయ్యే పరిస్థితిలో రెండో దఫా నత్రజనిని ఆలస్యంగా వేసి నారు ముదరకుండా చూడాలన్నారు. నారుమడిలో ఊద, ఒడిపిలి వంటి గడ్డిజాతి కలుపు ఉన్నట్లయితే విత్తిన 15-20 రోజులకు సైహలోఫాప్-పి-బ్యుటైల్ అనే కలుపు మందును 1.5 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలనీ రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి శోభ, రైతులు పాల్గొన్నారు.