Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేగుంట
ఉపాధి కూలీలకు పనులు కల్పించకుండా, చేసిన పనికి వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వాలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ ప్రశ్నించారు. చేగుంట మండల పరిధిలోని బోన్షాల గ్రామంలో రాజ్యాగం హక్కుల ప్రచార ోద్యమంలో భాగంగా గురువారం పర్యటించి ఉపాధి హామీ కూలీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు మాట్లాడుతూ ఇమ్మని కుంట నుంచి పులిమా మిడి శివారు వరకు పనిచేసి సంవత్సరం దాటుతున్నా ఇప్పటివరకు డబ్బులు రాలేదన్నారు. హరితహారం పనులకు సంబంధించి కూలీలకు డబ్బులు చెల్లించలేదని ధనలక్ష్మి, అంజనేయ, శ్యామ్, కనకలక్ష్మి తదితర శ్రమ శక్తి సంఘాల కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు లోకి తెచ్చిన ఎన్.ఐ.సీ, జాతీయ మొబైల్ మానిటరింగ్ విధానం వల్ల కూలీలకు సకాలంలో వేతనాలు అందించడం లేదన్నారు. కొత్తగా బ్యాంకు ఖాతాలు తీయాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో కూలీలు నరకయాతన పడుతూ వేతనాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దాపు రించిందన్నారు. నిధులను తగ్గించడమే కాకుండా అనేక మార్పులు తీసుకొస్తూ ఉపాధి పథకాన్ని ఎత్తి వేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ కూలీల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కుట్రలు మానుకోవాలని డిమాండ్ చేశారు.