Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాపన్నపేట
తెలంగాణ రైతుల సమస్యలు పరిష్కరించాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అద్యక్షులు పబ్బతి ప్రభాకర్ రెడ్డి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కిసాన్ సెల్ అద్యక్షులు సుఖ్ పాల్ సింగ్ కు గురువారం ఢిల్లీ లో విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. శుక్రవారం సోనియా గాంధీ జన్మ దినాన్ని పురస్కరించుకొని జంతర్ మంతర్ వద్ద జరిగే కార్య క్రమంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన వారు సుక్ పాల్ సింగ్తో మాట్లాడుతూ వరి మద్దతు ధర పెంచాలని కోరారు. తెలంగాణ లో ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ లోపబోయిష్టంగా ఉందని, అది పెద్ద రైతులకు ప్రయోజనకారిగా, పేద రైతులకు నష్టం కలిగించే లా ఉందని అన్నారు. రుణ మాఫీ చేసేలా చర్యలు తీసు కోవాలని కోరారు. రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు కోదండ రెడ్డి, తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన కిసాన్ సెల్ ప్రతినిధులు ఉన్నట్లు ప్రభాకర్ రెడ్డి తెలిపారు.