Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ప్రకటించాలి
- టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి
నవతెలంగాణ-తూప్రాన్ రూరల్/మనోహరాబాద్
సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తూ ఇతర రాష్ట్రాలు ప్రకటనలు చేశాయని అదే ఒరవడిలో తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు ఆదివారం తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్ యుటీఎఫ్ మెదక్ జిల్లా 5వ మహాసభలను జిల్లా అధ్యక్షులు జి.శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన టీఎస్ యుటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి టి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అసంబద్ధమైన సీపీఎస్ విధానం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు ఊరటనివ్వడం కోసం ఇచ్చే డీఎను వెంటనే ప్రకటించాలని, ప్రభుత్వం ఇప్పటికే మూడు డీఏలు బకాయి ఉన్నందున వెంటనే డీఏ ప్రకటించాలని కోరారు. అదేవిధంగా ఉపాధ్యాయుల కొరతను తీర్చాడానికి వెంటనే డీఎస్సీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ సభ్యులు సాయిలు మాట్లాడుతూ కేజీబీవీ ఉద్యోగులకు టైం స్కేల్ వర్తింప జేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రెసిడెన్షియల్, మోడల్ స్కూల్, కేజీబీవీలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగు లకు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని సూచించారు. రూ. 398 స్పెషల్ టీచర్లకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, పండిత్- పీఈటీ పోస్టులకు పదోన్నతులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కె.పద్మారావు, కోశాధికారి రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కవిత, కార్యదర్శిలు అజరు, భీంలా, శ్రీనివాస్, శ్రీజ్యోతి, రవి, విశాలాక్షి, శేఖర్, నగేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.