Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి
నవతెలంగాణ-ఐడీఏ బొల్లారం
యువత స్వశక్తితో ఉపాధి అవకాశాలను సృష్టించుకోవడం అభినందనీయమని బీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని బాలాజీనగర్‌కు చెందిన యువకుడు అశోక్ రెడ్డి స్వశక్తితో ఏర్పాటు చేసుకున్న కిరాణా షాపును కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆదివారం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత స్వశక్తితో ఉపాధి అవకాశాల వైపు అడుగులు వేయడం అభినందించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో బొల్లారం మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వి.హనుమంత్‌రెడ్డి, కౌన్సిలర్ గోపాల్లమ్మ, రాష్ట్ర కార్మిక నాయకులు వి.వరప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కృష్ణంరాజు, వెంకటయ్య, సత్తిబాబు, ఆటో యూనియన్ నాయకులు నాగిరెడ్డి, జంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.