Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మెహేంది, ముగ్గుల పోటీలు
- ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి కార్తీక్
నవతెలంగాణ-తూప్రాన్ రూరల్/మనోహరాబాద్.
ఎస్ఎఫ్ఐ సమాజ మార్పు కోసం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాటాలు చేయడమే కాకుండా విద్యార్థులను చైతన్యం చేయడంలో కూడా ముందుంటుందని ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి కార్తీక్ పేర్కొన్నారు. తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం ముగ్గుల పోటీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి కార్తీక్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ సమాజ మార్పు కోసం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని నిత్యం పోరాటాలే కాకుండా విద్యార్థులలో చైతన్యం తేవడం కోసం కూడా ముందే ఉంటుందన్నారు. విద్యార్థులు కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు. చదువుల్లో మాత్రమే కాదు ప్రతి రంగంలో ముందుండాలన్నారు. అమ్మాయిలందరూ కూడా ధైర్యంతో ముందు కదలాలని ఈ సంక్రాంతి సందర్భంగా కళాశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే ఈ ముగ్గుల పోటీలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే పదవ తరగతి విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ టెన్త్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఆడపిల్లను పుట్టనిద్దాం ఎదగనిద్దాం చదవనిద్దాం అనే నినాదంతో ఎస్ఎఫ్ఐ ముందుకెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.