Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగంపేటలో మినీ స్టేడియం ఏర్పాటుకు రూ.2 కోట్లు హామీ
- నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి
నవతెలంగాణ-కొల్చారం
కంటి వెలుగు పథకం చారిత్రాత్మకమని, ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి కోరారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. కంటి చూపుతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకునేలా చూడాలని ప్రజా ప్రతినిధులు, అధికారులు బాధ్యత తీసుకోవాలని కోరారు. అలాగే కంటిలో లోపం ఉంటే వైద్యులు ఉచితంగా అద్దాలు ఇవ్వడంతోపాటు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయిస్తారని తెలిపారు. అనంతరం రంగంపేటలో క్రికెట్ లీగ్ 2 పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. రంగంపేటలో అత్యధికంగా క్రీడాకారులు ఉన్నందున హర్షం వ్యక్తం చేస్తూ రెండు ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నట్లయితే క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం రెండు కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వాకిటి శశిధర్ రెడ్డి, జెడ్పిటిసి మేఘమాల సంతోష్, ఎంపీపీ మంజుల కాశీనాథ్, బీఆర్ఎస్వీ నాయకులు సుధీర్ రెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ తుక్కాపురం ఆంజనేయులు, మండల పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్, కొల్చారం సర్పంచ్ కరెంటు ఉమా రాజా గౌడ్, రంగంపేట సర్పంచ్ బండి సుజాత రమేష్, ఎంపీటీసీ గోకని మాధవి రాజా గౌడ్, ఉప సర్పంచ్ మచ్చ శ్రీనివాస్, మాదవి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.