Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెదక్ రూరల్
తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 4 నుంచి 8 వరకు హైదరాబాద్ లోని బండ్లగూడ మహావీర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగిన టేబుల్ టెన్నిస్ రాష్ట్రస్థాయి పోటీలలో ఉమ్మడి మెదక్ జిల్లా తృతీయ బహుమతి సాధించడం పట్ల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం తన ఛాంబర్లో గెలుపొందిన క్రీడాకారులు గబ్బుల అర్నీత్, రవితేజ, అనిష్, కిషోర్, నరేష్‌లు, విశ్వేశ్వర్, శ్రీనివాస్ చారి, సాయి ప్రణీత్, నరేష్‌లకు మెడల్స్, సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో ఉమ్మడి మెదక్ జిల్లాను ప్రధమ స్థానం తీసుకువచ్చేందుకు క్రీడాకారులు మరింత కృషి చేయాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ కె. ప్రభు, సభ్యులు మురళీధర్, జూలకంటి శ్రీనివాస్, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజు, విశ్రాంత పిడి ఆనందం, అంబుడ్స్ మెన్ అడ్వకేట్ శిరిగ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.