Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిజాంపేట
మండలంలోని గ్రామాలకు సీసీ రోడ్ల కోసం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి నిధులను కేటాయించినందుకు మండలంలోని సర్పంచులు హైదరాబాదులోని ఆమె స్వగృహంలో ఎమ్మెల్యే దంపతులను కలిసి శాలువాలు కప్పి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రావిపల్లి అమర సేనా రెడ్డి మాట్లాడుతూ మండలాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎమ్మెల్యే ప్రతి గ్రామానికి సీసీ రోడ్ల కోసం నిధులు కేటాయించారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనూష లక్ష్మీనరసింలు, తిప్పనగుల్ల సర్పంచ్ చంద్ర వర్దిని యాదగిరి, నందిగామ సర్పంచ్ లద్ద ప్రీతి, బీఆర్ఎస్ నాయకులు వెంకటాపూర్ దయాకర్, నంద గోకుల్ సంతోష్, సురేష్, పంగ రాజు, రాజగోపాల్, లక్ష్మణ్, మావురం రాజు, పాల్గొన్నారు.